కుక్కల దాడిలో 14 పొట్టేళ్లు మృతి

కుక్కల దాడిలో 14 పొట్టేళ్లు మృతి

అన్నమయ్య: రామాపురం మండలం నల్లగుట్టపల్లి బీసీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాసులు ఇంటి వద్ద ఉన్న పొట్టేళ్ల ఫారంపై కుక్కలు దాడి చేయడంతో 14 పొట్టేళ్లు మృతి చెందాయి. ఈ ఘటనతో రైతు తీవ్ర నష్టపోయాడు. గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని, వెంటనే నియంత్రణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు.