ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్ల మోత
ఇజ్రాయెల్‌లో సైరన్ల మోత కొనసాగుతోంది. ఇరాన్ మిసైళ్లతో విరుచుకుపడడంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. ఇరాన్ క్షిపణులు ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. తమ భూభాగంలోకి ప్రవేశించిన మిసైళ్లను ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేస్తుంది. క్షిపణులు దాడి చేస్తున్న క్రమంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.