డిచ్పల్లి–ఘన్పూర్ రైల్వేగేట్ మూసివేత
NZB: డిచ్పల్లి- ఘన్పూర్ మధ్య రైల్వేగేట్ను మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రైల్వేగేట్ ఈనెల 8వ తేదీ శనివారం రాత్రి పది గంటల నుంచి నుంచి 9వ తేదీ రాత్రి 11 గంటల వరకు రెండురోజుల పాటు మూసి ఉంటుందని వివరించారు. వాహనదారులు, ప్రయాణికులు గమనించాలని కోరారు.