లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన ఏఈ
WNP: గోపాల్పేట్ విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ లంచం కేసులో ACBకి చిక్కాడు. ఏదుల మండలానికి చెందిన ఓ రైతు ట్రాన్స్‌ఫార్మర్ కోసం రూ.40 వేలని డిమాండ్ చేశాడు. దీనిపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా ఈ రోజు హర్షవర్ధన్‌ను రూ.20 వేల లంచం తీసుకునే సమయంలో పట్టుకున్నారు. అతన్ని రేపు నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నట్లు సమాచారం.