భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

WGL: గురజాలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మెట్టు మల్లయ్య(78) అనే వృద్ధుడు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి ఈ నెల 6న మృతి చెందారు. అదే రోజు ఆయన భార్య సమ్మక్క(69) కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. భర్త దశదిన కర్మ పూర్తికాకుండానే శనివారం ఆమె కూడా మరణించడంతో కుటుంబం, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.