'కాంగ్రెస్ 420 హామీలను అమలు చేయాలి’
NRML: నర్సపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్షులు బర్కుంట నరేందర్ మాట్లాడుతూ.. యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, పెన్షన్ పెంపు, కల్యాణలక్ష్మి, రైతులకు రైతు భరోసా వంటి హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదని మండిపడ్డారు.