ఇంజక్షన్ వికటించి మహిళ మృతి
KDP: బ్రహ్మంగారిమఠం మండలం చెంచయ్యగారిపల్లెలో అనుమానాస్పద స్థితిలో రమాదేవి (43) వివాహిత మహిళ మృతి చెందింది. గ్రామస్తుల సమాచారం మేరకు బాలగాని రమాదేవి అనారోగ్యంతో ఉండడం వల్ల ఓ ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లగా ఇంజక్షన్ వేయడంతో ఇంజక్షన్ వికటించి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది