వడదెబ్బ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: కమీషనర్

వడదెబ్బ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: కమీషనర్

NDL: ప్రజలు వడదెబ్బ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు సూచించారు. ఇవాళ ప్రధాన కూడళ్లలో అవగాహన బ్యానర్లను ఆయన ఆవిష్కరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మధ్యాహ్నం వేళల్లో అనవసరంగా బయట తిరగవద్దని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ నుంచి ప్రజలను చైతన్య పరిచేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.