కొత్తపేట‌లో ప్రజా దర్బార్‌కు 238 వినతులు

కొత్తపేట‌లో ప్రజా దర్బార్‌కు 238 వినతులు

కోనసీమ: కొత్తపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 238 వినతులు సమర్పించారు. సమస్యలను ఎమ్మెల్యే ఓపికగా విన్నారు. సంబంధిత శాఖల అధికారులకు సదరు సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు.