నేడు కురుమూర్తి స్వామి అలంకార ఉత్సవం
MBNR: ఉమ్మడి జిల్లా ప్రజల కొంగుబంగారం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఆవాహిత దేవతా పూజలు జరిగాయి. ఆత్మకూరులోని ఎస్బీఐ బ్యాంకులో ఉన్న స్వామివారి స్వర్ణాభరణాల ఊరేగింపు అనంతరం సాయంత్రం 5:30 గంటలకు అలంకార ఉత్సవం ఉంటుంది. రాత్రి 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి అశ్వవాహన సేవ ఉంటుందని అర్చకులు తెలిపారు.