'చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి'
SRD: చదువుకున్నవారు రాజకీయాల్లోకి రాకపోవడం వల్లే గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని నర్సాపూర్ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఓలివ అభిప్రాయపడ్డారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో తాను సర్పంచ్‌గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, తాను గెలిస్తే సమగ్ర మార్పు తీసుకొస్తానని ఓలివ హామీ ఇచ్చారు.