బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం

బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం

ప్రకాశం: కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్యవివాహాలపై మహిళా పోలీసులు, విద్యాశాఖ అధికారులు విద్యార్థినులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 ఏళ్లు నిండే వరకు వివాహం చేసుకోరాదని, అలా చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని, తల్లిదండ్రులు బలవంతం చేస్తే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.