మారుతీ సుజుకీ 39 వేల యూనిట్ల రీకాల్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ విటారా కార్లను రీకాల్ చేసింది. ఫ్యూయల్ లెవల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్లలో లోపం కారణంగా మొత్తం 39,506 కార్లను రీకాల్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. 2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య తయారైన వాహనాల్లో ఈ లోపాన్ని గుర్తించినట్లు చెప్పింది. కారును తనిఖీ చేసి పాడైన పార్టును ఉచితంగా రీప్లేస్ చేస్తామని తెలిపింది.