నేడు పర్యటించనున్న మంత్రి కోమటిరెడ్డి

NLG : రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు నల్లొండ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించారు. ఉదయం 8 గంటలకు హైదరాబాదు నుంచి బయలుదేరి 10 గంటలకు నల్గొండలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారని పేర్కొన్నారు. అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.