'మద్యం మత్తులో వాహనం నడిపడం నేరం'
RR: మద్యంమత్తులో వాహనం నడపడం నేరమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో వాహనం నడిపితే భారతీయ న్యాయ సంహిత -2023లోని 105 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని, ఈ సెక్షన్ ప్రకారం 10 సంవత్సరాల జైలు, జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, గతవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 468 మంది పట్టుబడ్డ విషయం తెలిసిందే.