నేడు గురుకుల ప్రవేశ పరీక్ష
KMM: కల్లూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఆరో తరగతి బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 480 మంది విద్యార్థినులు ఈ పరీక్షకు హాజరుకానున్నట్లు ప్రిన్సిపల్ కనకదుర్గ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.