‘వందేమాతరం’.. ఓ అక్షర జ్వాల: మంత్రి
HYD: 'వందేమాతరం’.. ఓ అక్షర జ్వాల అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. HYD గన్‌ఫౌండ్రీ మహబూబియా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో వందేమాతరం గేయం ఆలపించారు. మన దేశ స్వాతంత్య్ర పోరాటంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వందేమాతరం సమర నినాదంలా నిలిచిందని, యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందన్నారు.