ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి

ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి

హుజూర్‌నగర్: ఎన్టీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణ కేంద్రంలోని కోదాడ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి పాటుపడిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.