నార్నూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డా.అంబేడ్కర్, మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు.