ముస్తాబైన ఎంపీడీవో కార్యాలయం

ముస్తాబైన ఎంపీడీవో కార్యాలయం

ELR: స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎంపీపీ నిధులు రు. 15 లక్షలతో ఎంపీడీవో ఆవరణాన్ని అభివృద్ధి చేసి, జాతీయ జెండా స్తూపం నిర్మాణం చేశారు. సమావేశాలకు అనువుగా ఉండే విధంగా షెడ్లు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ధర్మరాజు జాతీయ జెండా ఎగరవేస్తారని ఎంపీడీవో మనోజ్ తెలిపారు.