రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధి మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన క్రీడాకారులు మనోజ్ఞ, పల్లవి ఇటీవల జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఖోఖో పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నేపథ్యంలో వారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా సదరు క్రీడాకారుణులను ఇవాళ అభినందించారు.