బస్సు కండక్టర్ వద్ద రూ.23 వేల చోరీ!

బస్సు కండక్టర్ వద్ద రూ.23 వేల చోరీ!

హర్యానా కైతల్ నుంచి జింద్ వెళ్తున్న బస్సులో కండక్టర్ వద్ద రూ.23 వేల నగదు చోరీకి గురైంది. ఈ దొంగతనానికి సంబంధించిన CCTV ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికుల రద్దీని అదునుగా తీసుకున్న దుండగులు కండక్టర్ బ్యాగులోని నగదును మాయం చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు.