విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధం
NRML: భైంసా మండలం కామోల్ గ్రామంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో ఓ రైతు పంట బుగ్గయ్యింది. గ్రామానికి చెందిన టేకుల దశరథ్ తన మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా ఎండల తీవ్రతకు విద్యుత్ తీగలు ఒరుసుకుని నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎకరం మేర పంట పూర్తిగా కాలి బూడిదైంది. చేతికొచ్చిన పంట కళ్లముందే కాలిపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.