నిరసన ర్యాలీలు సక్సెస్.. జగన్ హర్షం

నిరసన ర్యాలీలు సక్సెస్.. జగన్ హర్షం

AP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో చేపట్టిన నిరసన ర్యాలీల విజయవంతంపై పార్టీ అధినేత జగన్ హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో ఆగ్రహం ఉందని, దీనికి నిరసన ర్యాలీలు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజారోగ్యం కోసం ఇతర పార్టీల ప్రతినిధులు కూడా కలిసి రావడాన్ని ఆయన స్వాగతించారు.