ఆటో కార్మికుల సమ్మె పిలుపు

ఆటో కార్మికుల సమ్మె పిలుపు

VSP: ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని విశాఖ అఖిలపక్ష ఆటో మోటార్ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అల్లిపురం సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాలుగు లేబర్ కోడ్స్ రద్దు, జిఓ 21 ఉపసంహరణ, అధిక చలాన్లు రద్దు, యాప్ ఆధారిత ప్రైవేట్ రవాణా నియంత్రణ, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సరస్వతి పార్క్ ర్యాలీకి భారీగా రావాలని కోరారు.