మైలవరంలో గౌతు లచ్చన్న 116వ జయంతి

NTR: దివంగత నేత సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. లచ్చన్న 116వ జయంతిని మైలవరం పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. బలహీన వర్గాలు, రైతులు, కార్మికుల సంక్షేమం కోసం లచ్చన్న చేసిన ఉద్యమాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన జాతియావత్తుకు నాయకులన్నారు. సాహసానికి, కార్యదక్షతకు ఆయన నిదర్శనమన్నారు.