సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: ఎంపీ

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: ఎంపీ

HNK: సిజేరియన్ ప్రసవాల సంఖ్యను తగ్గించి, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండ కలెక్టరేట్లో ఎంపీ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని తెలిపారు. వైద్య ఆరోగ్య సిబ్బంది మరింత బాధ్యతతో పని చేయాలని పిలుపునిచ్చారు.