విద్యార్థి వైద్య ఖర్చులకు ఉపాధ్యాయులు ఆర్థిక సాయం
కృష్ణ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థికి ఉపాధ్యాయులు ఆర్థిక సహాయం చేశారు. మండల పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామానికి చెందిన డి.సాయిరాజ్ ఇటీవల మోపిదేవి జడ్పీ హైస్కూలుకు వెళుతూ ప్రమాదంలో గాయపడ్డాడు. అతని వైద్య ఖర్చులకు ప్రభుత్వ ఉపాధ్యాయులు తుంగల శ్రీరామమూర్తి, తుంగల చంద్రశేఖర్ రూ.10వేలు ఆర్థిక సహాయాన్ని ఎంఈఓ జీ.ఎన్.బీ గోపాల్ చేతులమీదుగా అందచేశారు.