VIDEO: తొర్రూర్ లో జాతీయ జెండాకు అవమానం

MHBD: తొర్రూరు మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జరిగిన వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. అతిధులు ఎగరవేసిన జెండా చిరిగిపోయి ఉండడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ జెండా పాతదని, కనీసం కొత్తది ఆవిష్కరించే స్థితిలో లేరా అని విమర్శలు వస్తున్నాయి.