ఈనెల 19న మండల స్థాయి క్రీడలు
SRCL: చందుర్తి మండల కేంద్రంలో ఎన్‌వైకే, మైభారత్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పోంచెట్టి రాకేష్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 19న కబడ్డీ, వాలీబాల్, షటిల్, రన్నింగ్, చెస్, జావలిన్ త్రో లాంటి క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. మండలంలోని క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.