మండలి ఛైర్మన్‌ను కలిసిన ఎమ్మెల్సీలు

మండలి ఛైర్మన్‌ను కలిసిన ఎమ్మెల్సీలు

ఏపీ శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఆరుగురు వైసీపీ MLCలు కలిశారు. తమ రాజీనామాలను ఆమోదించాలంటూ ఆయనను కోరారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, జకియా ఖానం, పోతుల సునీత ఛైర్మన్‌ను కలిశారు. కాగా, వారందరినీ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని మండలి ఛైర్మన్ ఇదివరకే నోటీసులు జారీ చేశారు.