ఉచిత కంటి అద్దాల పంపిణీ

ఉచిత కంటి అద్దాల పంపిణీ

NRPT: ఉట్కూరు మండల కేంద్రంలో వాకిటి శ్రీహరి సేవాసమితి ఆధ్వర్యంలో ఇటీవల ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 25 మందికి సమస్యలు గుర్తించి, రాంరెడ్డి కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేశారు. అనంతరం గ్రామానికి వచ్చినవారికి ఉచిత కంటి అద్దాలు, మందులు, బ్రెడ్లు అందజేశారు. శస్త్రచికిత్సలు చేసుకున్న వారు మంత్రి వాకిటి శ్రీహరికి ధన్యవాదాలు తెలిపారు.