పెనుగొండలో ఇద్దరు వ్యక్తులు అదృశ్యం

పెనుగొండలో ఇద్దరు వ్యక్తులు అదృశ్యం

ATP: పెనుగొండలోని సిపిఐ కాలనీలో నివాసం ఉంటున్న పద్మావతి(44)ఆమె కూతురు స్నేహ(7) అదృశ్యంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. అక్టోబర్ 7వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి కనిపించడం లేదని భర్త వెంకటేష్ ఫిర్యాదు చేశారు. వీరి స్వగ్రామం పెనుగొండ మండలం శెట్టిపల్లి గ్రామంగా స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.