స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్‌ను కలిసిన సాయి చరణ్ గౌడ్
ADB: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డిని జిల్లా కాంగ్రెస్ యువ నాయకుడు, కౌన్సిలర్ సాయి చరణ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. చరణ్ గౌడ్‌ను శివసేన రెడ్డి శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. జిల్లాలో పార్టీ పటిష్టతతో పాటు, క్రీడల అభివృద్ధికి, యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చొరవ చూపాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.