ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ

ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ

SKLM: మందస మండలంలోని బుడంబో ఆశ్రమ పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎం కమల శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రగతిని తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అలాగే పదవ తరగతి విద్యార్థులకు పలు సూచనలను అందజేశారు.