VIDEO: వన దుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు
MDK: పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి శివారులో విరిసిన శ్రీ ఏడుపాయల క్షేత్రంలో శనివారం అర్చకులు పార్థివ శర్మ విశేష పూజలు నిర్వహించారు. చైత్రమాసం, శుక్లపక్షం, దశమి, స్థిర వాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. కుంకుమార్చన, సహస్రనామాలు సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం మంగళహారతి నైవేద్యం సమర్పించారు.