భార్యను హతమార్చిన భర్త

ప్రకాశం: యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. భార్య నీలం మంగమ్మ(45)ను భర్త నీలం శ్రీనివాసరావు హతమార్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.