విద్యుత్ ఘాతంతో 4 గేదెలు మృతి

ADB: కడెం మండలంలోని ఉడుంపూర్‌కు చెందిన సంజీవ్, మహేష్, సువర్ణలకు చెందిన నాలుగు గేదెలు శనివారం మృతి చెందాయి. చేనులో స్తంభం విరిగి తీగలు పడిపోవడంతో అటుగా మేతకు వెళ్ళిన గేదేలు మృత్యువాత పడ్డాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని బాధిత రైతులు పోయారు సుమారు 2.40 లక్షల నష్టం వాటిల్లిందని తమను ఆదుకోవాలని కోరుతూ డీఈకి వినతిపత్రం అందజేశారు.