ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్‌పై కఠిన చర్యలు: ఎస్పీ
ASR: పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లకు అతుక్కుపోతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లు పెరుగుతున్నాయని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. బెట్టింగ్‌కు పాల్పడినా, ప్రోత్సహించినా 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.