అనంతపురంలో "జయహో అమరావతి" ర్యాలీ
ATP: అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించిన సందర్భంగా అనంతపురంలో 'జయహో అమరావతి' పేరిట భారీ విజయోత్సవ ర్యాలీ గురువారం నిర్వహించారు. టవర్ క్లాక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. రాజధానికి చట్టబద్ధత రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.