మధిరలో సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు భూమిపూజ చేసిన జిల్లా జడ్జి

మధిరలో సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు భూమిపూజ చేసిన జిల్లా జడ్జి

KMM: మధిర మున్సిపాలిటీలో సుమారు రూ.24 కోట్లతో నిర్మించనున్న సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణం కోసం జిల్లా జడ్జి గోరంట్ల రాజగోపాల్ గురువారం భూమి పూజ నిర్వహించారు. మధిర సీనియర్ సివిల్ జడ్జి ప్రశాంతి, జూనియర్ సివిల్ జడ్జి దీప్తి, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, ఇతర సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. నూతన కోర్టు భవనం ఏర్పాటు ద్వారా ప్రజలకు త్వరిత న్యాయం జరుగుతుందన్నారు.