సావిత్రిబాయి పూలేను నేటి సమాజం ఆదర్శంగా తీసుకురావాలి: తిరుపతి
HNK: మహిళల విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి పూలేను నేటి సమాజం ఆదర్శంగా తీసుకోవాలని కేయూ జేఏసీ అధ్యక్షులు డి. తిరుపతి అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా కేయూలోని ఆమె విగ్రహానికి జేఏసీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. జేఏసీ నేతలు కందికొండ తిరుపతి, బొస్కా నాగరాజు, జనగాం రాజారాం పాల్గొన్నారు.