రైల్వే ప్రతిపాదనలకు కేంద్రం పచ్చజెండా: ఎంపీ
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైల్వే స్టేషన్లలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను ఎంపీ డీకే అరుణ రైల్వే శాఖకు పంపించారు. కురుమూర్తిలో ప్లాట్ ఫామ్ ఎత్తు పెంపు, గద్వాలలో రైళ్ల నిలుపుదల, ఫుట్ ఓవర్ బ్రిడ్జి తదితర పనులు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మరికల్ మండలం పెద్దచింతకుంటలోని ఆరూబీ వద్ద రోడ్డు మరమ్మతులు చేపట్టనున్నారు.