కలెక్టర్‌ను కలిసిన నరసాపురం డీఎస్పీ
W.G: నరసాపురం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎం.సుధాకర్ ఇవాళ భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌తో పాటు జేసీ రాహుల్ కుమార్‌కి ఆయన మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నరసాపురం డివిజన్లో శాంతిభద్రతల పరిరక్షణ, పలు కీలక అంశాలపై అధికారులతో డీఎస్పీ చర్చించారు. విధి నిర్వహణలో సమన్వయంతో ముందుకెళ్తామని ఆయన తెలిపారు.