భారీ వర్షాలు.. కలెక్టర్, ఎస్పీ పరిశీలన

వికారాబాద్: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి పరిగి మండలంలో పర్యటించారు. రోడ్లు జలమయమై, పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ఆదేశించారు.