డోన్‌లో పెద్ద సరిగెత్తు వేడుకలు

డోన్‌లో పెద్ద సరిగెత్తు వేడుకలు

కృష్ణా: డోన్‌లోని ఆయా గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున మొహర్రం పండుగలో భాగంగా పెద్ద సరిగెత్తు వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆయా పీర్ల చావిడిల ముందు అగ్ని గుండాలను ఏర్పాటు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల మధ్యన గ్రామంలో పీర్లను ఊరేగించారు. భక్తిశ్రద్ధలతో పీర్లకు పాతేహాలు సమర్పించి పూజలు చేశారు.