VIDEO: 'వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు'

VIDEO: 'వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు'

SKLM: ఆమదాలవలస పట్టణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం శనివారం సందర్భంగా వేదమంత్రాలతో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చైతన్య స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.