భారీ ధర పలికిన దిర్సంపల్లి తైబజార్
VKB: దిర్సంపల్లి గ్రామ పంచాయతీలో తైబజార్ వేలం పాట భారీ ధర పలికింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకట రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన తైబజార్ వేలం పాటలో గ్రామస్థులు పాల్గొనగా మహమ్మద్ మన్నాన్ రూ.90,500 తైబజార్ నిర్వాహన అధికారాలను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ మన్నాన్‌ను గ్రామ కార్యదర్శి, సర్పంచ్ శాలువాతో సత్కరించారు.