ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కలెక్టర్
PLD: జిల్లాలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఏ మాత్రం జాప్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన PGRSలో ఆమె పాల్గొని బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు ఊరటనివ్వాలని ఆమె స్పష్టం చేశారు.