95 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా పోటీ
TG: మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి సర్పంచ్ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామం నుంచి బీఆర్‌ఎస్ మద్దతుతో బరిలో దిగారు. 95 ఏళ్ల వయసులో కూడా కుమారుడు జగదీష్ రెడ్డితో కలిసి రామచంద్రారెడ్డి గ్రామంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. రామచంద్రారెడ్డికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.